హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ దర్శనమిచ్చింది. మణికొండలోని రెస్టారెంట్ ఔట్ లెట్ నుంచి జిలానీ అనే కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే ఓపెన్ చేసి సగం తిన్న తర్వాత అందులో ప్లాస్టిక్ కవర్ బయటపడింది. దీంతో జిలానీ వీడియో తీసి..సోషల్‌మీడియాలో పోస్టు చేయటంతో పాటు జీహెచ్ఎంసీకి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేశాడు. ఇటీవలి కాలంలో చాలా రెస్టారెంట్లు అనేక పొరపాట్లకు లోపాలు బయటపడుతున్నాయి. ఆర్డర్ చేసిన ఆహారంలో పిన్నులు, బొద్దింకలు వస్తున్నాయి. ఇప్పుడు అయితే ఏకంగా ప్లాస్టిక్ కవర్ వచ్చింది.