Homeహైదరాబాద్latest Newsఅర్ధరాత్రి ఆపని చేస్తూ దొరికిపోయిన అరియనా..!

అర్ధరాత్రి ఆపని చేస్తూ దొరికిపోయిన అరియనా..!

అరియానా గ్లోరి.. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ థింకింగ్ మారిందనే చెప్పాలి. ఇంటర్వ్యూకి ముందు కాస్త పద్దతిగా కనిపిస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. ఎప్పుడైతే ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసిందో అప్పటి నుంచి గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది ఈ సొగసరి. నెట్టింట్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ.. తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతూ ఉంటోంది.

తాజాగా, అరియానా గ్లోరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీతో ఓ పార్టీకీ వెళ్లినట్లు తెలిపింది. అక్కడే అర్ధరాత్రి అవడంతో కారులో వస్తుండగా.. మధ్యలో పాలకూరను దొంగతనంగా తీసుకుంది. మార్కెట్‌లో రూ. 50 పెట్టాలి అందుకే దొంగతనం చేస్తున్నా ఇదొక సంతోషం అంతే. మా ఇంట్లో రేపు పాల కూర వండుకుని తింటాను అని చెప్పింది.

ఆ తోటలోంచి బయటకు వస్తుండగా.. ఓ ముగ్గురు బండిపై రావడంతో జెస్సీ, అరియానా భయపడిపోతారు. మీదేనా అని వారిని అడుగుతారు. కాదని అనడంతో వామ్మో బతికిపోయా అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ప్రస్తుతం అరియానా వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు తుప్పల్లో దూరావ్ జాగ్రత్త అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే.. ఆ టెన్షన్‌లో ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా అని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img