Homeఫ్లాష్ ఫ్లాష్ఇంట్లోనే వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందట.. జర జాగ్రత్త

ఇంట్లోనే వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందట.. జర జాగ్రత్త

న్యూఢిల్లీ: కార్యాలయాలు, ఇతర పనిప్రదేశాలు, సామాజిక కార్యక్రమాల్లో కంటే ఇంట్లోనే వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని అధ్యయనం పేర్కొంది.

వివిధ ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీరుపై లండన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేశారు.

కరోనా బాధితుడితో వరుసగా ఐదు రోజులు ఇల్లు పంచుకునే కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనంలో తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన 45 ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’ అధ్యయనాలపై స్టాటిస్టికల్‌ రివ్యూ జరపడం ద్వారా ఈ ఫలితాల్ని వారు వెల్లడించారు.

వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కాగానే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచడం చాలా ముఖ్యమని.. తద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని సూచించింది.

వ్యాప్తిని అరికట్టడంలో లక్షణాలు లేనివారే సవాల్‌గా మారారని అధ్యయనం పేర్కొంది. లక్షణాలు లేకపోవడం వల్లే ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’లో అసలు వైరస్‌ను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో గుర్తించలేకపోతున్నామని స్పష్టం చేసింది.

ఇక వ్యాప్తికి.. వయసుకి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది.

వివిధ ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీరు ఎలా ఉందో అర్థం చేసుకునేందుకు తమ అధ్యయనం ఉపయోగపడుతుందని ప్రొఫెసర్‌ హేలే థామ్సన్‌ అభిప్రాయపడ్డారు.

Recent

- Advertisment -spot_img