Homeహైదరాబాద్latest Newsకాంగోలో కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి, మరో 60 మందికి గాయాలు

కాంగోలో కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి, మరో 60 మందికి గాయాలు

కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయి. దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారని, 60మంది గల్లంతైనట్లు అంచనా అని అధికారులు తెలిపారు. నైరుతి కాంగోలోని ఇడియోఫా పట్టణంలో ఉన్న ఓడరేవు సమీపంలో శనివారం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో ఏడుగురిని ప్రాణాలతో కాపాడగలిగారు. అయితే గల్లంతైనవారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్​ను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img