మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.300 కోట్ల ఆస్తి కోసం.. తన సొంత మామని కాంట్రాక్టు ఇచ్చి హత్య చేయించింది. తొలుత ఈ కేసును యాక్సిడెంట్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. మే 22 న తన మామ పురుషోత్తం (82 )ను కారు ఢీకొట్టింది. అనంతరం అతడు మృతి చెందాడు. అయితే మృతుడి సోదరుడికి అనుమానం వచ్చి.. పోలీసులను సంప్రదించి ఇది ప్రమాదం కాదని హత్య అని ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో సీసీటీవీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్లు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతుడి కోడలు అర్చన పుట్టెవార్ నుంచి డబ్బులు తీసుకుని అత్తమామను కారుతో ఢీకొట్టినట్లు వారిద్దరూ పోలీసులకు తెలిపారు.