Homeహైదరాబాద్latest Newsదారుణం.. నవజాత కవల బాలికల గొంతు కోసి హత్య.. తండ్రి అరెస్ట్‌..!

దారుణం.. నవజాత కవల బాలికల గొంతు కోసి హత్య.. తండ్రి అరెస్ట్‌..!

అప్పుడే పుట్టిన నవజాత కవల బాలికలు అనుమానాస్పదంగా మరణించారు. పసి పాపల గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మెంధార్ సబ్ డివిజన్‌లోని చైజ్‌ల కయాని గ్రామంలో నవజాత కవల బాలికల గొంతు కోసి చంపారు. అయితే ఆడ పిల్లలు పుట్టారన్న నిరాశతో కన్న తండ్రి మహ్మద్ ఖుర్షీద్‌ వారిని చంపి ఉంటాడని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Recent

- Advertisment -spot_img