హైదరాబాద్ ఐఎస్ సదన్‌లోని ఓ పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ, మల్కాజ్‌గిరికి చెందిన 14, 15 ఏళ్ల బాలికలు గత నెల 24న జనగామ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆశ్రయం కల్పిస్తామని నమ్మించి నాగరాజు, సాయి, రాజు, అఖిల్, రోహిత్ వారిపై అత్యాచారం చేసి వదిలేశారు. సైదాబాద్ పోలీసులు బాలికలను గుర్తించి ఆరా తీయగా విషయం బయటికొచ్చింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.