సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు తానే దాడి చేసినట్లు అంగీకరించాడు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల ఫోన్ లొకేషన్‌తో పాటు ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఆరుగురు నిందితులు మైనర్లే. అటు నిందితుల తల్లిదండ్రులు విజయవాడలోని వడ్డెర కాలనీలో నిన్న ఆందోళనకు దిగారు.