Homeహైదరాబాద్కబ్జాలు అక్రమ కట్టడాలు నిలువరించడంలో అధికారులు విఫలం

కబ్జాలు అక్రమ కట్టడాలు నిలువరించడంలో అధికారులు విఫలం

మేడిపల్లి, ఇదే నిజం: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కొంత మంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల ప్రోత్సహంతోనే అక్రమంగా నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని విమర్శించారు బండ నరసింహ. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ పర్మిషన్ తో కట్టడాలు జరుగుతున్నాయి, ఇప్పుడున్న మున్సిపాలిటీకి లక్షల రూపాయలు గండి కొడుతున్నారన్నారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా బండ నర్సింహ అధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి, పలు అక్రమ నిర్మాణాలపై కమీషనర్, ఎమ్మార్వోకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పిర్యాదు చేయడం జరిగిందని, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటి నుండి 28 వరకు వార్డులలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భవనాలు అన్ని రకాల సరైన అనుమతుల మేరకే చేపడుతున్నారా లేదా ? అని ప్రశ్నించినా కాని రోజు రోజుకు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వార్డులో మరోవైపు
చెంగిచేర్ల అరవింద కాలనీలో పార్కు స్దలం కబ్జా అవుతుందని దీనిని పెన్సింగ్ వేసి కాపాడాలని కమీషనర్ కు పిర్యాదు చేయడం జరిగిందన్నారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని కమీషనర్, మండల రెవెన్యూ అదికారుల దృష్టి కి తీసుకెళ్లిన సమయంలో మాత్రమే అక్కటికి వచ్చి హంగామా చేయడం తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం తప్ప మరొకటి లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు భయపడకుండా నిర్భయంగా చర్యలు తీసుకోవడం మంచిది. దీని వల్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటే మనం ఎంత చెప్పినా వేస్ట్ అనే ఆలోచనలో ప్రజలు ఉంటారు. వీటపైన చర్యలు తీసుకుంటారో లేదొ అదికారులు స్పష్టం చేయాలి.
రా చెరువు అలుగు నుండి శుద్ధ కుంట నుండి నల్ల చెరువు వరకు పారే నీటి కాలువ దాదాపు ఎమ్మార్వో రికార్డు ప్రకారం 33 ఫీట్లుగ ఉండాలి , కానీ ఇప్పుడు ఈ కాలువ వెంబడి పక్కన ఉన్న భూస్వాములు కబ్జా చేసుకొని 5 ఫీట్లు, 6 ఫీట్లు కాలువను చేసి ఆక్రమించుకొని భవనాలు ,కట్టడాలు జరుపుకొని లక్షల రూపాలు గడిస్తున్నారు, ఇట్టి కాలువను పరిరక్షితు కాలువపై కట్టిన వాటిని తొలగిస్తూ కపాడవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గుండెల్లి శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img