Homeతెలంగాణపాపం బస్సు డ్రైవర్ ను చితకబాదారు.. స్పందించిన సజ్జనార్

పాపం బస్సు డ్రైవర్ ను చితకబాదారు.. స్పందించిన సజ్జనార్

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తొలి నుంచి ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు రెండు రోజుల క్రితం కొత్తగూడెం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేశారు. భద్రాచలంలో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు దూషించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారని, వారి నిబద్ధత కారణంగా సంస్థ మనుగడ సాగిస్తోందన్న ఆయన వారిని దూషించడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఎంతమాత్రమూ సహించబోదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ప్రయాణ సమయంలో ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతూ ఎక్స్(x) చేశారు. బస్సు డ్రైవర్ పై అందుకే దాడి చేశారు.. బస్ కోసం వేచి చూసీచూసీ విసిగిపోయిన కొందరు ప్రయాణికులు ఇక లాభం లేదని ఆటోలు ఎక్కారు. అదే సమయంలో అక్కడకు బస్ రావడంతో వారంతా దిగిపోయి బస్ ఎక్కారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. ప్రయాణికులు, కండక్టర్ సరస్వతి ఎంత వారించినా వినిపించుకోలేదు. ఈ ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావుతో కలిసి డ్రైవర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img