Homeహైదరాబాద్latest NewsFree Bus Scheme : 'కాస్తైనా ఆలోచించరా' ఆటో డ్రైవర్లు

Free Bus Scheme : ‘కాస్తైనా ఆలోచించరా’ ఆటో డ్రైవర్లు

Free Bus Scheme

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ప్రపంచలోనే అతిపెద్ద రోడ్డురవాణా సంస్థగా పేరుగాంచిన ఆర్టీసీ రాష్ట్ర విభజన తర్వాత చిన్నదైంది. ఇంధన ధరలు పెరగడంతో నష్టాల్లో మునిగితేలింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా చెప్పుకోదగ్గ ఫలితాల్లేవు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీం తెచ్చింది. కొత్తలో బాగానే ఉన్నా..ప్రస్తుతం లేనిపోని సమస్యలు సృష్టిస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలినన్ని బస్సులు లేక జనం అగచాట్లు పడుతున్నారు. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు దొరక్క మహిళలు, స్టేషన్లలో బస్సులు ఆపట్లేదంటూ జెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఏ ఒక్క జిల్లాకో, ప్రాంతానికో ఈ సమస్య పరిమితం కాలేదు. రాష్ట్ర వాప్తంగా ఇదే తంతు. కొత్త బస్సులు తెస్తున్నామని అధికారులు చెబుతున్నా..అందుకు తగ్గట్లు కొత్త ప్రయాణికులు కూడా ఎక్కువే అవుతున్నారు.

అయితే ఫ్రీ బస్ స్కీం వల్ల నష్టపోయింది ప్రధానంగా ఆటో డ్రైవర్లు. పెద్దపెద్ద డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రాక, ఇంకొకరి కింద పనిచేయలేక, ఆత్మ గౌరవంతో బతికేందుకు సొంతంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారెందరో ప్రస్తుతం నానాయాతన అనుభవిస్తున్నారు. చిట్టీలు కట్టేందుకు డబ్బుల్లేక, పిల్లలు, కుటుంబ పోషణ భారమైంది. రోజు గడవడానికి కూడా అప్పుచేయాల్సిన పరిస్థితి కొందరిది. అంతేగాక అనారోగ్య సమస్యలు తలెత్తితే అంతే సంగతి. మొత్తం కుటుంబమే ప్రభావితమవుతోంది. ఇంట్లో సంతోషం లేక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక చాలామంది తమలో తామే కుమిలిపోతున్నారు. అయినా వాళ్లకు ఫ్రీ బస్ స్కీం మీద వ్యతిరేక ఆలోచనల్లేవు. ఉంటే ఆందోళనలు చేసేవాళ్లేమో! సిటీ రోడ్ల మీద తిరుగుతూ ఎందరికో జీవనోపాధిగా మారిన ఆటోలు ప్రస్తుతం చాలావరకు గల్లీలకే పరిమతమయ్యాయి. బస్సులేమో మెయిన్ రోడ్డు మీద దర్జాగా క్వీన్‌లా తిరుగుతున్నాయి. రోడ్ కింగ్ గా పిలిచే లారీతో పోటీ పడుతున్నాయి. ఈ కొత్త పరిణామాలు ప్రజలను పీడించుకుతింటున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో అసహనం, వ్యతిరేకత పెరుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలకు దిగాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img