ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్ ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆటోలు నిబంధనలకు విరుద్ధంగా నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. లైసెన్స్‌లు తప్పకుండా తీసుకోవాలన్నారు. తాగి వాహనాలు నడపవద్దని,. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, ఆటో రిజిస్ర్టేషన్ నెంబర్ కనబడేలా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆటోలో డ్రైవర్ పక్క సీట్లను తొలగించాలని, ఐదుగురు కంటే ఎక్కువ ప్రయాణికులను ఆటోలో తీసుకెళ్లరాదని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలతో కలిగి ఉండాలని ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించాలని సూచించారు . ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ కానిస్టేబుల్ తదితరులు ఉన్నారు.