ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామంలో క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో వరి పొలాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరి లో వచ్చే మోగి పురుగు ,అగ్గి తెగులు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వరిలో అధిక పీలికలు రావడానికి వసుధ1కేజీ క్లీన్సర్ 4 కేజీ దంట్టు గుళికలు వరిలో వచ్చే అగ్గి తెగులు జింక్ పురుగు నివారణకు త్రీ మోనార్క్ పురుగు నివారణకు ప్రొడక్ట్స్ రైతులు వాడుకోవాలని అలాగే క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలని పత్తి కూరగాయలు పళ్ళతోట లకు కలిగే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా క్లోరోఫిల్ ఆర్గానిక్స్ వారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏరియా మేనేజర్ మహిపాల్ మాట్లాడుతూ మోగి పురుగు ,అగ్గి తెగులు నివారణకు కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయి తెలిపారు. ఆరోగ్యవంతంగా రైతులకు ఆరోగ్యకరమైన జీవితం ఒక సేంద్రీయ ఎరువుల వినియోగించిన ఆహారం తీసుకోవడం మాత్రమే అన్నారు. అలాగే భూసారం పెరిగి మొక్కలు పైరు ఆరోగ్యవంతంగా ఉండి అధిక దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. పైరు అధిక దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఎస్ ఓ శంకర్ ,శ్రీ రామ ట్రైడర్స్ స్థానిక డీలర్ కిషన్ వంద మంది రైతులు పాల్గొన్నారు.