Homeహైదరాబాద్latest Newsన్యాయ విజ్ఞాన సదస్సులతోనే చట్టాలపై అవగాహన: న్యాయమూర్తి శ్యాం ప్రసాద్

న్యాయ విజ్ఞాన సదస్సులతోనే చట్టాలపై అవగాహన: న్యాయమూర్తి శ్యాం ప్రసాద్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో న్యాయమూర్తి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సులు గ్రామాల్లో నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన వస్తుందని అన్నారు ధర్మపురి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి రాజేష్ అన్నారు. ధర్మపురి కోర్టు ఆధ్వర్యంలో నేరెళ్ల గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన న్యాయమూర్తి శ్యాం ప్రసాద్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి రాజేష్ ని స్థానిక న్యాయవాది బార్ అసోసియేషన్ కోశాధికారి జాజాల రమేష్ గ్రామస్థులతో కలిసి స్వాగతం పలికారు

ఈ సంధర్భంగా న్యాయమూర్తి శ్యాం ప్రసాద్ గారు మాట్లాడుతూ వివిధ కేసుల గురుంచి అవగాహన కలిపించారు ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడం అందరి బాధ్యతగా తీసుకోవాలన్నారు చట్టం అనేది అందరికి సమానమే అని తెలిపారు యేండ్ల కొద్ది కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా కూడ ఒకే రోజులో సత్వరమే లోక అదాలత్ లో పరిష్కరించుకోవచ్చు అని అన్నారు గ్రామంలో వ్యవసాయం చేస్తున్న రైతులు మరియు శ్రమను నమ్ముకునే వారు ఎక్కువ ఉన్నారనీ తెలిసింది కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం అనందనీయం అని అన్నారు నేరెళ్ల శ్రీ సాంబశివుని ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను మంచి మనస్సు తో అలోచించి స్వార్థం అనేదాన్ని పక్కన పెట్టి ఒక్కరికి ఒకరు సహాయం చేసుకోవాలని అన్నారు కార్యక్రమం నిర్వాహకుడు న్యాయవాది జాజాల రమేష్ ని అభినందించారు

ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి రాజేష్ ఎస్ ఐ ఉదయ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు రాజేష్ ఉపాధ్యక్షుడు రామడుగు రాజేష్ జనరల్ సెక్రెటరీ బందెల రమేష్ సెక్రెటరీ మామిడాల శ్రీకాంత్ కోశాధికారి జాజాల రమేష్ క్రీడా సెక్రెటరీ బత్తిని ఇంద్రకరణ్ సుంకె రాజు ఎంపీటీసీ రెడ్డవేణి సత్యం మాజీ సర్పంచి పలిగిరి సత్యం నేతలు కాసారపు బలగౌడ్ పంచాయతి కార్యదర్శి మల్లారెడ్డివివిధ కుల సంఘాల నేతలు గ్రామస్థులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img