Homeహైదరాబాద్latest Newsఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి

– జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ బాషా
– ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ఇదే నిజం, జగిత్యాల జిల్లా ప్రతినిధి: ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ బాషా సూచించారు. ఈ నెల 26 నుంచి మార్చి1 వరకు దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘మేక్ ఎ రైట్ స్టార్ట్ – బీకాం ఫైనాన్షియల్లీ స్మార్ట్’ అనే అంశంపై నిర్వహించనున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల గోడ ప్రతిని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రెడ్డితో కలిసిసోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆర్థిక వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ పొన్న వెంకట్ రెడ్డి, జిల్లా ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్, ఎస్​బీఐ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్​ మేనేజర్లు గజేందర్, అప్పారావుతో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img