Homeహైదరాబాద్latest Newsరైతులకు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు

రైతులకు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు

ఇదే నిజం, గొల్లపల్లి: రైతులకు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు గొల్లపల్లి, గుంజపడుగు, ఇబ్రహీంనగర్, భీమ్రాజ్ పల్లి, గోవింద్ పల్లి, అబ్బాపూర్, రాఘవపట్నం, గంగదేవిపల్లి గ్రామాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు విత్తనాలు కొనేటప్పుడు విత్తనాలకు సంబంధించిన రసీదు మరియు లైసెన్స్ ఉన్న విత్తన డీలర్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది.తీసుకున్న రసీదు మీద విత్తన కంపెనీ పేరు రకం బ్యాచ్ నెంబర్ లాట్ నెంబర్ రేటు ఉండాలి. విత్తన తయారీ తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలి. ప్రతి విత్తన ప్యాకెట్ మీద జి ఏ ఈ సి నంబర్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ కార్యక్రమాలలో ఏఈవోలు శ్రీహరి, అశ్విని, గంగాధర్ నాయక్, అలేఖ్య, వంశీ గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

Recent

- Advertisment -spot_img