Homeఆంధ్రప్రదేశ్‘బెంజ్’​ మంత్రి రాజీనామా చేయ్​.. ఇవిగో ఆధారాలు

‘బెంజ్’​ మంత్రి రాజీనామా చేయ్​.. ఇవిగో ఆధారాలు

విశాఖపట్నం: మంత్రి జయరాం అవినీతిపై ఫిర్యాదు చేస్తే వైసీపీ ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు, ఏపీబీకి ఫోన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు మెసేజ్ కూడా రాలేదరి టీడీపీ సీనియర్​ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తాజాగా మరోసారి అయ్యన్నపాత్రుడు బెంజ్ కారుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను మీడియాకు చూపించారు. ఫొటోలు, వీడియోలు స్క్రీన్ మీద వేసి చూపారు. ఇన్ని ఆధారాలు ఇచ్చినా మంత్రిపై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూస్తామన్నారు. వైసీపీ పాలనలో ఓ మాజీ మంత్రే ఫిర్యాదు చేస్తేనే దిక్కులేదని, అలాంటిది సామాన్యుడు ఫిర్యాదు చేస్తే దిక్కుమొక్కు ఉంటుందా? అని ప్రశ్నించాడు. ఒకవేళ కారు మంత్రిది కాకపోతే బెంజ్ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకుంది? కారును ఇప్పటికీ మంత్రి కొడుకే వాడుతున్నాడు. మంత్రి జయరామే స్వయంగా బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? అని మంత్రికి సవాల్​ విసిరారు. అలాగే మంత్రి జయరాంకు సంబంధించిన భూకుంభకోణాలపై కూడా త్వరలోనే ఆధారాలు బయటపెడతా. తనను ఏం చేసినా ఫర్వాలేదు. జైల్లో పెట్టినా.. చంపినా భయపడను’ అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
ఆ బెంజ్​కారు తమది కాదు: మంత్రి జయరాం
ఆ బెంజి కారు తన కుమారుడిది కాదని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ వేరే వాళ్ల కారు పక్కన తన కుమారుడు ఫొటో దిగాడని చెప్పారు. హెలికాఫ్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫొటో తీసుకుంటే మనది అవుతుందా? అని ప్రశ్నించారు. ఆ కారు తమదేనని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జయరాం సవాల్ చేశారు.
ఏ-14 కార్తీక్.. మంత్రి బినామీ
ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్.. మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు తన భర్త్​ డే సందర్భంగా ఖరీదైన బెంజ్​ కారును గిఫ్ట్​గా ఇచ్చినట్లు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దీనికి సాక్ష్యంగా మంత్రి కుమారుడు కారును నడిపే దృశ్యాలు, ఫోటోలు రిలీజ్​ చేశారు. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ బెంజ్​ కారు ఇచ్చినట్లు, ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలని అయ్యన్న ప్రశ్నించారు. ఏ 14 కార్తిక్​ మంత్రి జయరాంకు బినామీ అని, అది పుట్టినరోజు కానుక కాదు…మంత్రికి ఇచ్చిన లంచంగా ఆయ్యన్న ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img