HomeజాతీయంBabri Masjid case judgement : బాబ్రి కేసు తీర్పు ఇవ్వనున్న కోర్టు

Babri Masjid case judgement : బాబ్రి కేసు తీర్పు ఇవ్వనున్న కోర్టు

Babri Masjid case judgement : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ స్పెషల్​ కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది.

దీంతో దేశ వ్యాప్తంగా తీర్పుపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని కోర్టు విచారణకు హాజరు కావాలని సూచించింది.

ఈ కేసులో బీజేపీ సీనియర్​ నాయకులు ఎల్​కే అద్వాణీతో పాటు మురళీ మనోహర్​ జోషి, ఉమాభారతిలతో పాటు మరికొందరు సీనియర్​ నేతలు ఉన్నారు.

1992 డిసెంబర్​ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చి వేసిన ఘటన అందరికీ తెలిసిందే. దీనికి కారకులంటూ అప్పటి ప్రభుత్వం 32 మంది ప్రముఖులపై కేసు నమోదు చేసింది.

ఇప్పటికే ఈ కేసులో రాబోయే తీర్పుపై ఉమాభారతి మాట్లాడుతూ తీర్పు ఎలా ఉంటుందో తనకు పట్టింపు లేదని “నన్ను ఉరితీసినట్లయితే, నేను ఆశీర్వదించబడతాను” అని వెల్లడించారు.

అలాగే చాలా మంది ప్రముఖులు ఈ కుట్ర కేసును తమపై మోపడం తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇక కేసు, కుట్ర విషయాలు మొత్తానికి ఎల్​కే అద్వాణీకి చాలా కీలకంగా ఉన్నాయి.

కేసులో నిర్ధోషిగా ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే వచ్చే రాష్ట్రపతి ఉన్నికల్లో ఆయనను రాష్ట్రపతిగా చేయాలన్నది బీజేపీ పార్టీ నిర్ణయాల్లో ఒకటి.

పార్టీకి ఆయన చేసిన సేవలకుగాను అయనను గౌరవించుకునేందుకు ఇంతవరకు సరైన ప్రభుత్వ పదవి ఆయనకు దక్కలేదు.

గత ఎన్నికల్లోనే రాష్ట్రపతి కావాల్సిన అద్వాణీ కేసు కారణంగా అనర్హునిగా అయ్యారు. ఇక రేపు వచ్చే తీర్పు ఆయనకు ఎంతో కీలకంగా మారనుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img