HomeTelugu Newsప్రముఖ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ‘బేబీ’ హీరోయిన్

ప్రముఖ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ‘బేబీ’ హీరోయిన్

బేబీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి, ఆ సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగానే మరో సినిమాను అంగీకరించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఇక ఆశిష్ సరసన కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మరో సినిమాలో చోటు దక్కించుకుంది. అదీ సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా ఛాన్స్ కొట్టేసింది. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు భాస్కర్’ ఒక సినిమా చేస్తున్నాడు. ఆగస్టులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారు.

Recent

- Advertisment -spot_img