Homeహైదరాబాద్latest Newsజడ్పీహెచ్ఎస్ స్కూల్ లో బడి బాట కార్యక్రమం

జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో బడి బాట కార్యక్రమం

ఇదే నిజం, గొల్లపల్లి: పెగడపెల్లి మండలం కేంద్రంలోనీ స్థానిక ZPHS స్కూల్ లో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,జిల్లా కలెక్టర్ షేక్ యష్మీన్ భాష పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి అనంతరం స్కూల్ విద్యార్థులకు యునిఫామ్స్,బుక్స్ నీ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రైవేట పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని,ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యహ్నం భోజనంతో పాటు,టెక్స్ట్ బుక్స్,యునిఫామ్స్ తో పాటు స్కాలర్‌షిప్‌ అవకాశం కూడా ఉంటుందని,ఈ ఒక్కరోజులోనే సుమారు 40 వేల టెక్స్ట్ బుక్స్,70 వేల వర్క్స్ బుక్స్,3 లక్షల 82 వేల నోట్ బుక్స్,62 వేల యూనిఫాన్స్ పంపిణీ చేయడం జరిగిందని,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని,ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,నియోజక వర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తామనీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు,ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img