Homeహైదరాబాద్latest Newsచెప్యాలలో బడిబాట.. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చాలని ప్రచారం

చెప్యాలలో బడిబాట.. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చాలని ప్రచారం

ఇదేనిజం, కొడిమ్యాల: మండలంలోని చెప్యాల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీల్లో చదివితే కలిగే లాభాల గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యార్థులకు ఉ చితంగా యూనిఫామ్, పుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీల్లో ముగ్గురు, పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్కుమార్, రాంప్రసాద్, అంగన్వాడీ టీచర్లు డి. జ్యోతి, బి. సుజాత, టి. అంజలి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img