ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తొలుత ఆయనను అరెస్ట్ చేసింది.
ఆయనను బెయిల్‌పై విడుదల చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు ED తెలిపింది. ట్రయల్ కోర్టు నిర్ణయించే షరతులతో సంజయ్ సింగ్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.