Homeసినిమావైర‌ల్ అవుతోన్న బజరంగీ 'మున్నీ' ఫోటోలు

వైర‌ల్ అవుతోన్న బజరంగీ ‘మున్నీ’ ఫోటోలు

హైద‌రాబాద్ః సల్మాన్ ఖాన్ హీరో గా న‌టించిన బజరంగీ భాయ్ జాన్ చిత్రంలో క‌నిపించిన చిన్నారి గుర్తుందా.. ఇప్పుడా చిన్నారి పెరిగి పెద్ద‌దైంది. అచ్చం హీరోయిన్‌లా ఉన్న అ అమ్మాయి ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఫాద‌ర్ విజయేంద్రప్రసాద్ అందించిన క‌థ‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమాలో పాకిస్థాన్ నుంచి త‌ప్పిపోయిన బాలిక‌ ఇండియాకి వచ్చి సల్మాన్ ఖాన్ చెంత‌కు చేరుతుంది. ఆ బాలిక‌ను క్షేమంగా పాకిస్థాన్‌కు చేర్చే క‌థ‌తో ఈ చిత్రం న‌డుస్తోంది.

ఈ చిత్రంలో మున్నీగా క‌నిపించిన‌ ఐదేళ్ల పాపగా హర్షాలీ మల్హోత్రా న‌టించింది. మూగ , చెవుడు ఉన్న పాపగా ఆమె తన హావభావాలతోనే అద్భుతమైన యాక్టింగ్ చేసింది. ఆ సినిమా చేసే సమయంలో ఆమె వయస్సు ఏడేళ్లు.

ఆ సినిమా తర్వాత మళ్ళీ హర్షాలీ ఏ సినిమాలో కూడా నటించలేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు అయిపొయింది.

తాజాగా ఈ చిన్నారి దీపావళీ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

12 ఏళ్ల వయస్సులోనే ఈ స్థాయిలో అందంగా మెస్మరైజ్ చేస్తూ ఉంటే కచ్చితంగా ఆమె 15 ఏళ్ళు దాటేసరికి హీరోయిన్ అయిపోతుందని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వ‌స్తున్నాయి.

ఇక ఆమె లుక్స్ చూసిన తర్వాత బాలీవుడ్ దర్శక, నిర్మాతల కన్ను కూడా పడినట్లు తెలుస్తుంది.అన్ని అనుకూలంగా జరిగితే మరో మూడు, నాలుగేళ్లలో హర్శాలీ హీరోయిన్ గా పరిచయం అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Recent

- Advertisment -spot_img