Homeహైదరాబాద్latest Newsత్యాగానికీ ప్రతీక బక్రీద్

త్యాగానికీ ప్రతీక బక్రీద్

ఇదేనిజం, ధర్మపురి/ఎండపల్లి: జగిత్యాల జిల్లా వెల్గటూర్-ఎండపల్లి మండలాల లో ముస్లిం సోదరులు పండుగ పర్వదినం త్యాగానికీ మానవసేవకు ప్రతీకైన బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పండుగ పర్వదినం సందర్బంగా ముస్లీం సోదరులు ఈద్గాల వద్ద ఘనంగా సముహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహించడం జరిగింది. ఉమ్మడి మండలంలోని గుల్లకోట, శాఖపూర్, జగదేవ్ పేట, అంబారిపేట, గొడిషేలపేట, పాతగుడూర్ గ్రామాలలోని ఈద్గాల వద్ద ఇమామ్ చే దివ్య ఖురాన్ గ్రంధంను పఠనం చేయించి, మహ్మద్ ప్రవక్త బోధనాలే ఆదర్శంగా సర్వలోక శాంతి చేకురేలా సమైక్యతతో సన్మార్గంలో జీవనం కొనసాగాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుని, దాన ధర్మాలు, ఖుర్భానీ పంచి వేడుకలు జరుపుకున్నట్లు ఉమ్మడి మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమామ్, మౌజాన్, సదర్, ముస్లీం మతపెద్దలు మహ్మద్ సలీం, ఫకీరోద్దిన్, రఫీ, అనీఫ్, అల్లీ సాబ్, రహీం, అబ్దుల్లా, అలీం, అబ్బాస్, దస్తగిరి, అంకూస్, హఫీజ్, తాజ్, అప్సర్, ప్యార్ మియా, నజీర్, సాదుల్లా, ముస్తఫా, సాదిక్, హైదర్, నసీరోద్దిన్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img