‘బలగం’ ఫేమ్ మొగిలయ్యకు మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మొగిలయ్య ప్రాణాలను కాపాడాలని, తమని ఆదుకోవాలని ఆయన భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.