Homeహైదరాబాద్latest Newsపవన్ కల్యాణ్ కు పోటీగా బాలకృష్ణ?

పవన్ కల్యాణ్ కు పోటీగా బాలకృష్ణ?

ఈ సంవత్సరం ద్వితీయార్థం రిలీజ్ అయ్యే సినిమాలు ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ను ఇవ్వనున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల మూవీలు వరుసగా విడుదల కానున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, పవన్ కల్యాణ్ ఓజీ, బాలకృష్ణ NBK 109 సినిమాలు వరుసగా రానున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతలకు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఓజీ, గేమ్ ఛేంజర్, NBK 109 సినిమాలు ఇంకా రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు. వీటిల్లో కనీసం రెండు సినిమాలు పోటీ పడే అవకాశం ఉంది. అదే జరిగితే సినిమా వసూళ్లపై కొంతమేర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. డసెంబర్‌లో ఓజీ, NBK 109 సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img