Homeహైదరాబాద్latest Newsబాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఆ ఇద్దరికీ నో ఇన్విటేషన్..?

బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఆ ఇద్దరికీ నో ఇన్విటేషన్..?

నందమూరి బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ప్రముఖులంతా కూడా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాదులో ఎల్లుండి అనగా సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం జరగబోతోంది. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి తో పాటు ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ , అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ కూడా ఆహ్వానం అందింది. కానీ సొంత ఇంటి కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు అని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img