పేటీఎంపై నిషేధం విధించండం.. ఫోన్ పే యాప్ కు కలిసొచ్చింది. ఇటీవల ఆర్బీఐ పేటీఎంను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులు తమ మొబైల్స్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించేసి.. ఇతర డిజిటల్ పేమెంట్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అయితే పేటీఎం మీద నిషేధం విధించడం.. పోన్ పేకు కలిసొచ్చింది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అటువంటి పరిస్థితిలో మిలియన్ల మంది పేటీయం యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నారు. వినియోగదారులు తమ ఫోన్‌ల నుంచి పేటీయంని అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇతర చెల్లింపు యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ప్రారంభించారు. ఈ జాబితాలో ఫోన్‌పే ముందంజలో ఉంది. ఈ సమయంలో ఫోన్‌పే డౌన్‌లోడ్‌లు 4.4 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగాయి.