బండికి ఐదురాష్ట్రాల బాధ్యతలు..
ఇదేనిజం, హైదరాబాద్: ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్కు కీలక రాష్ట్రాలను అప్పజెప్పారు. తెలంగాణ, ఏపీతోపాటూ మహారాష్ట్ర, గోవా, ఒడిశా రాష్ట్రాలను సైతం బండికి అప్పజెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన అనంతరం బండి సంజయ్ అలిగారన్న ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. దీంతో బండికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంతోపాటూ ఏపీ బాధ్యతలను బండికి అప్పజెప్పారు. ఇటీవల బీజేపీ అధినాయకత్వం.. ఏపీ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు. తాజాగా బండికి ఏపీ బాధ్యతలను అప్పజెప్పడం గమనార్హం.