Homeఫ్లాష్ ఫ్లాష్Bandi sanjay:రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం హర్షణీయం

Bandi sanjay:రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం హర్షణీయం

Bandi sanjay:రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ అభివ్రుద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శమని కొనియాడారు . తెలంగాణ అభివ్రుద్ధి, సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోందని ,. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపట్ల మోదీకి ఉన్న అభిమానంతో తెలంగాణ అభివ్రుద్దిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారాణి కొనియాడారు .మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్దం. కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ స్వయంగా లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించలేదనడం సిగ్గు చేటని విమర్శించారు

Recent

- Advertisment -spot_img