Homeహైదరాబాద్latest NewsBandi Sanjay: అలా నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటా?

Bandi Sanjay: అలా నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటా?

కాంగ్రెస్ ఆరు హామీలను అమలు చేస్తామని మోసం చేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని ఆయన గుర్తుచేశారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోని కారణంగానే బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేసినట్లు ఆధారాలు చూపాలని ఆయన అన్నారు. ఆసరా పింఛన్లు రూ.4వేలు, అలాగే విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చామని నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న అని ఆయన సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే మీరంతా పోటీ నుంచి తప్పుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఎల్లుండి లోగా నిరూపిస్తే నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటా?.. లేదంటే కాంగ్రెస్‌ 15 స్థానాల్లో పోటీ నుంచి విరమించుకుంటుందా?” అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

Recent

- Advertisment -spot_img