HomeSocial MediaBREAKING: KCRపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్..!

BREAKING: KCRపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్..!

బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చని.. కేసీఆర్ కుట్రల వల్ల ఏమైనా జరగొచ్చని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి.. బీజేపీ పైన నెట్టివెస్తారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ బొందపెట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కాదని ఆయన చెప్పారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని, ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు అసలు లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img