Homeహైదరాబాద్latest NewsBandi Sanjay : గ్యారంటీలు ఏమయ్యాయి?

Bandi Sanjay : గ్యారంటీలు ఏమయ్యాయి?

– ఎందుకు అమలు చేయడం లేదు?
– ప్రజలను మభ్యపెట్టడం తప్ప వాళ్లు చేసిందేమిటి?
– మంత్రి పొన్నం, కేటీఆర్కు నన్నుతిట్టడమే పని
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
– కోహెడలో మలిదశ ప్రజాహిత యాత్ర ప్రారంభం

ఇదేనిజం, కరీంనగర్ ప్రధానప్రతినిధి: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడంల లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. మలిదశ ప్రజాహిత యాత్రను సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధి కోహెడ మండలంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి మాడ్లాడారు. మంత్రి పొన్నం, మాజీ మంత్రి కేటీఆర్ 24 గంటలు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధిని చెప్పేందుకు తాను యాత్ర చేస్తున్నానని, కాంగ్రెస్ పాలనలో, పొన్నం ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. అభివృద్ధికి తాను చేసిన ఖర్చులు అన్ని చూపెడుతున్నాని, అవి తప్పయితే తనపై కేసు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్ను గద్దె దించే వరకు పోరాడింది బీజేపీయేనని, కాంగ్రెస్ ఏం చేసిందని ఓట్లేశారని అడిగారు. రాష్ట్రానికి కేంద్రం నిధులిస్తే, దానిని దారి మళ్లించకుండా నీచులు బీఆర్ఎస్ నేతలని ఘాటుగా విమర్శించారు. విమర్శలే ప్రాతిపదికన రాజకీయాలు చేస్తామనడం ప్రజాస్వామ్యం కానేకాదని పేర్కొన్నారు. మోదీ ప్రధాని కావాలా? రాహుల్ ప్రధాని కావాలా? ప్రజలు ఆలోచించాలని చెప్పారు. మోదీని ప్రజలు మళ్లీ ప్రధాని చేయాలని నిర్ణయించారని, తెలంగాణలో 17 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 370 ఎంపీ సీట్లు సాధించబోతున్నామని పేర్కొన్నారు. ఐదారు రోజుల్లో ఎంపీ సీట్ల అభ్యర్థులను పార్టీ ప్రకటించనున్నట్టు బండి చెప్పారు. కోహెడకు బయలుదేరే ముందు కరీంనగర్ లోని రాజస్థాన్ మార్వాడీ మందిర్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Recent

- Advertisment -spot_img