బీఆర్ఎస్ పార్టపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ చేష్టలు కేంద్ర ప్రభుత్వ సహాయ మంత్రిగా లేవు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి అనే విషయాన్ని మర్చిపోయాడన్నారు. రేవంత్ రెడ్డిని కాపాడలనే తాపత్రయం ఆయనలో ఎక్కువగా కనిస్తుందన్నారు. నిజానికి భాజపా, కాంగ్రెస్‌ల మధ్య వైరం ఉందని భావిస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం విచిత్రంగా ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. కేంద్రంలో మోడీ, రాహుల్ మధ్య రోజురోజుకు వార్ నడుస్తుంటే దాన్ని వదిలేసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇంత బిజీలో ఉన్న రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్న తెలిపారు.