Homeఫ్లాష్ ఫ్లాష్అంపైర్ వల్ల ఓడిన బంగ్లాదేశ్.. ఈ ICC రూల్ కొంపముంచిందా..?

అంపైర్ వల్ల ఓడిన బంగ్లాదేశ్.. ఈ ICC రూల్ కొంపముంచిందా..?

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. గ్రూప్-డిలో ఆడిన ముగ్గురిలో నేగి సూపర్-8 అర్హతకు చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. నిన్న అంపైర్ తప్పుడు నిర్ణయం, ICC రూల్స్ వల్ల బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికాపై 16.2వ బంతికి బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాను అంపైర్ LBWగా ప్రకటించారు. ఆ బంతి ప్యాడ్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. బంగ్లా రివ్యూకు వెళ్లగా అది నాటౌట్ అని తేలింది. రూల్స్ ప్రకారం అంపైర్ నిర్ణయం తీసుకోగానే అది డెడ్ బాల్‌గా మారుతుంది. దీంతో బౌండరీ వెళ్లినా ఫోర్ ఇవ్వలేదు. చివరికి బంగ్లా 4 రన్స్ తేడాతో ఓడింది. తౌహిద్ కాసేపటికే అంపైర్ కాల్‌తో రబాడ బౌలింగ్‌‌లో ఔటవ్వడం బంగ్లా కొంపముంచింది. మొత్తంగా బంగ్లా టెగర్లు దురుదృష్టవశాత్తు మ్యాచ్‌ను కోల్పోయారు.

Recent

- Advertisment -spot_img