Homeఫ్లాష్ ఫ్లాష్హైదరాబాద్‌పై పది పరుగుల తేడాతో బెంగళూరు విజయం

హైదరాబాద్‌పై పది పరుగుల తేడాతో బెంగళూరు విజయం

దుబాయ్‌: IPL మూడో లీగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 164 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ ముందు ఉంచింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 19.4 ఓవరల్లో 153 పరుగులు చేసి హైదరాబాద్ ఆలౌటైంది. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్ (6) ఆరంభంలోనే పెవిలియన్ చేరినప్పట్టకీ.. మరో ఓపెనర్ బెయిర్ స్టో (61) పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కుదురుగా ఆడకపోవడంతో విజయానికి కావాల్సిన రన్‌ రేట్ బాగా పెరిగిపోయింది. మనీష్ పాండే (34) ఫర్వాలేదనిపించాడు. బెంగళూరు బౌలరల్లో యుజువేంద్ర చాహల్ 3, నవ్‌దీప్ సైని 2, శివం దూబె 2, స్టెయిన్ 1 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

Recent

- Advertisment -spot_img