Homeహైదరాబాద్latest NewsBank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో సెలవులు ఇవే!

Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో సెలవులు ఇవే!

బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. మే నెలకు సంబంధించి బ్యాంకుల సెలవులను RBI ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

 • మే 1న మే డే సందర్భంగా ప్రధాన నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులు మూతబడతాయి.
 • మే 5 – ఆదివారం
 • మే 7 – లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ కారణంగా ఈ రోజు అహ్మదాబాద్, పనాజీ, భోపాల్, రాయ్‌పూర్‌లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
 • మే 8 – రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు.
 • మే 10 – బసవ జయంతి, అక్షయ తృతీయ కారణంగా ఈ రోజు బెంగళూరులో బ్యాంకులు తెరుచుకోవు.
 • మే 11 – రెండో శనివారం, బ్యాంకులకు సెలవు.
 • మే 12 – ఆదివారం
 • మే 13 – లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ రోజు శ్రీనగర్‌లో బ్యాంకులు మూతబడతాయి.
 • మే 16 – ఈ రోజు సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో రాష్ట్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
 • మే 19 – ఆదివారం
 • మే 20 – లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కారణంగా ముంబై, బేలాపూర్‌లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
 • మే 23 – బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఉత్తరప్రదేశ్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చండీగఢ్, జమ్మూ, లక్నో, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బెంగాల్, న్యూఢిల్లీ, శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రధాన నగరాల్లో బుద్ధ పూర్ణిమ నాడు బ్యాంకులకు సెలవు ఉంది.
 • మే 25 – నాలుగో శనివారం, బ్యాంకులకు సెలవు.
 • మే 26 – ఆదివారం
  అయితే ఈ తేదీల్లో బ్యాంకులు మూతబడినా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సర్వీసులు కొనసాగుతాయి. బ్యాంకు పనులు ఉన్నవారు హాలిడేస్ చెక్ చేసుకొని షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం మంచిది.

Recent

- Advertisment -spot_img