– ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కంటే తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ సెగ్మెంట్ కు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు, పవన్ నాటకాలు ఆడడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కల్యాణ్ పార్టీకి రాలేదంటూ అతడికి ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకోసం వాళ్లు చేసిందేమీ లేదని మండిపడ్డారు.