ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల,జన గణన – స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. బీసీలను కులాల వారిగా లెక్కించి సంఖ్యను చెప్పకుండా రాజకీయ,సామాజిక, ఆర్ధిక రంగాలలో ఎదగకుండా తొక్కి వేస్తున్నారని బిసిలకు చట్టసభలో రిజర్వేషన్లు లేకపోవడం ఎలక్షన్ ముందు అధికారంలోకి రావడానికి బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో కామారెడ్డి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అధినాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో బిసిలకు అన్యాయం జరుగుతుందివారికి న్యాయం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లపై సవితి తల్లి పై ప్రేమ చూపినట్టే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది సరైన పద్ధతి కాదు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల జరపాలని లేనట్లయితే ప్రజా కోర్టులో చూసుకుంటామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు, బి ఆర్ పి అధ్యక్షులు రామావత్ లాలు నాయక్, బిజెపి నాయకులు నక్క వెంకటేష్ యాదవ్,టిడిపి నాయకులు వసుకుల కృష్ణయ్య, సిపిఐ నాయకులు జ్యోతి బస్ నేత, ఆంజనేయులు,కొండా లలిత,చొల్లేటి భాస్కరాచారి,అంకం చంద్రమౌళి నేత , పగిడిమర్రి సత్యమూర్తి నేత, గాజుల మురళి నేత, రాచమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెల్ల కృష్ణ చారి, చేరిపల్లి విజయలక్ష్మి,ముసిని సత్యం నేత , గౌరోజు బ్రహ్మచారి, కూరెళ్ళ రామకృష్ణ చారి, జిల్లా రాములు, మేజర్ సంఘం నాయకులు వెంకటయ్య, పూసల సంఘం అధ్యక్షులు రఘు, వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ,వనం బుచ్చయ్య నేత,ముసిని వీరయ్య నేత,వనం శ్రీను నేత,ఏరువా కృష్ణ నేత , కర్నాటి సత్యనారాయణ నేత తదితరులు పాల్గొన్నారు.