హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లను మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయని, అతడు జట్లలోని కీలక వ్యక్తులను సంప్రదించి వారిని ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఐపీఎల్ జట్లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ సదరు వ్యక్తి ఎవరినైనా సంప్రదిస్తే వెంటనే తమకు నివేదించాలని బోర్డు జట్లకు సూచించినట్లు సమాచారం. ఈ ఘటన ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలను మరోసారి తెరపైకి తెచ్చింది.