Homeఫ్లాష్ ఫ్లాష్Be Alert : నూడిల్స్ తింటున్నారా.. జ‌ర జాగ్ర‌త్త‌

Be Alert : నూడిల్స్ తింటున్నారా.. జ‌ర జాగ్ర‌త్త‌

Noodles are a favorite of theirs. Every mother is looking at the noodles to get ready in two minutes.
But did you know that awe noodles bring

హైదార‌బాద్‌: నూడిల్స్ అంటే ఇష్ట‌మండ‌ని వారు త‌క్కువే ఉంటారు. రెండు నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చేందుకు ప్ర‌తి త‌ల్లి నూడిల్స్ వైపే చూస్తోంది.

కానీ ఆవే నూడిల్స్ ప్రాణం తీస్తాయ‌ని తెలుసా. నూడిల్స్ చాలా కాలం నిల్వ ఉంటే అవి విష‌పూరితం అవుతాయి.

ఇక అలాంటివి తింటే ప్రాణాలపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌ని వైద్యులు స్ప‌ష్టం చేస్తున్నారు.

చైనా ఈశాన్య ప్రావిన్స్‌ హిలాంగ్జియాంగ్‌లోని జిక్సీ నగరానికి చెందిన ఒక కుటుంబం ఈ నెల 10 వ తేదీన ప్రీజర్‌లో నిల్వచేసిన నూడిల్స్‌ తిన్నారు.

అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై కుటుంబంలోని ఏడుగురు ఐదు రోజుల తర్వాత చనిపోయారు. దవాఖానలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు సోమవారం మరణించారు.

మొక్కజొన్న పిండితో త‌యారు చేసిన ఏడాది క్రితం నూడిల్స్ పులిసి ‘బొంగ్రేకిక్’ విషంలాగా మారిందని హీలాంగ్‌ జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లో ఆహార భద్రత డైరెక్టర్ గావో ఫీ చెప్పారు.

ఇది కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడుతో పాటు అనేక అవయవాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని గావో ఫీ చెప్పారు.

అందుకే నూడిల్స్ కాదు తినే ఐటమ్స్ ఏవైనా స‌రే వాటిని తీసుకునే ముందు వాటి గడువు తేదీని తప్పనిసరిగా తనిఖీ చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Recent

- Advertisment -spot_img