Homeజిల్లా వార్తలుసీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి: ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్

సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి: ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్

ఇదే నిజం,గొల్లపల్లి: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామాన్ని ఆరోగ్య సిబ్బందితో సందర్శించి ఇంటింట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిని తొలగించి, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి మంగళవారం,శుక్రవారం డ్రై డేగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ గట్టు శ్రీధర్, సూపర్వైజర్లు నరేందర్,ద్వారక,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img