Homeహైదరాబాద్latest Newsఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి

ఉపాధి హామీ కూలీల పై తేనెటీగల దాడి

ఇదే నిజం, ఆదిలాబాద్ ప్రధాన ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. బేల మండలం కోదురు గ్రామానికి చెందిన కూలీలు రోజూవారీగా అటవీ ప్రాంతంలో పనులకు వెళ్లారు. పని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తేనెటీగలు కూలీలపై దాడి చేశాయి. కూలీలు భయంతో ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ దాడిలో పదిమందికి పైగా కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని RIMS ఆస్పత్రికి తరలించారు. చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, రిమ్స్ డైరెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Recent

- Advertisment -spot_img