Homeహైదరాబాద్latest Newsబెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లను సంబంధిత సిబ్బందిని నియమించి అన్ని రకాల వైద్య సదుపాయాలు...

బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లను సంబంధిత సిబ్బందిని నియమించి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలి

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి గత మూడు నాలుగు దశాబ్దాల నాడు మెయిన్ ఏరియా ఆసుపత్రి తో పాటు ఐదు డిస్పెన్సరీలతో కార్మికులకు వారి కుటుంబాలకు వైద్య చికిత్సలు అందించిన బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి , సింగరేణి యాజమాన్య సంస్కరణలో భాగంగా 100 ,150 పడకలుగా ఉన్న ఆసుపత్రి వార్డులన్నీ మూసివేసి ఎమర్జెన్సీ వార్డుని జనరల్ వార్డ్ గా చేసుకొని వైద్య సేవలు అందకుండా అవుటు పేషెంట్లను కూడా తక్కువగా చూపిస్తూ పూర్తిగా మూసివేసి డిస్పెన్సరీ స్థాయికి దిగజార్చి రిటైర్డ్ కార్మికులకు ఇప్పుడు పని చేస్తున్న కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు, వారి కుటుంబాలకు, వైద్య సేవలు అందకుండా చేసే కుట్రలను బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గత వారం రోజులుగా పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఏరియా ఆసుపత్రి సందర్శనతో పాటు సంబంధిత జిఎం ఆస్పత్రి సిబ్బంది తో కలిసి దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది. దీంట్లో భాగంగా ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులను నియమించాలని, అన్ని వార్డులు తెరవాలని, గత నెల రోజులుగా మూసి ఉంచిన ఫార్మసీని వెంటనే తెరవాలని, సరిపడినంత మంది పారామెడికల్ సిబ్బందిని నియమించాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పరిరక్షణ కమిటీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నది. కనీసము బిపి షుగర్ లాంటి జబ్బులకు కూడా మందు గోళీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి సింగరేణి యాజమాన్యం ఆసుపత్రిని దిగజార్చిందని, యూనియన్ నాయకులు మండిపడ్డారు. దీంట్లో భాగంగా శాంతి ఖని గని పై సమావేశం నిర్వహించి ఏరియా ఆసుపత్రికి సంబంధించిన స్థితిగతుల గురించి దాని కాపాడుకోవాల్సినటువంటి అవశ్యకత, గురించి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క బెల్లం పల్లి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కోసం పోరాటంలో పాల్గొనాలని సింగరేణి బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 1న, ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్న ఏరియా హాస్పిటల్ ముందు జరుగు ఒకరోజు దీక్షలో గని కార్మిక వర్గం పాల్గొనాలని బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.

Recent

- Advertisment -spot_img