బెంగళూరు: మాదకద్రవ్యాల కేసులో అరెస్టైనా రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ విదేశీ పర్యటనలు, మత్తు పదార్థాల పార్టీలు, ఆస్తులపై సీసీబీ పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీబీ సంయుక్త కమిషనర్ సందీప్ పాటిల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా డ్రగ్స్ వాడే అలవాటు ఉన్న ఇతరుల పేర్లను బయట పెట్టినట్లు సమాచారం. ఇందులో సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు వారి సంతానం ఉన్నట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా వచ్చిన నగదు హవాలా రూపంలో తరలించి ఇరువురు ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి సాక్ష్యాలు సేకరించేందుకు వీరి రక్తం, తలవెంట్రుకలను సేకరించిన వైద్యులు మడివాళలోని ప్రయోగశాలకు పంపించారు. కనీసం 92 రోజుల కిందట డ్రగ్స్ వాడినా ఈ పరీక్షల్లో తేలిపోతుందట. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు, మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు షేక్ ఫైజల్, ఆదిత్య ఆళ్వ ఆచూకీ తెలియలేదు. ఇదే కేసులో అరెస్టైన ప్రశాంత్ రాంకా, లూమ్, రవిశంకర్, రాగిణి, సంజనా, రాహుల్, నియాజ్‌ల పోలీసు కస్టడీని సోమవారం వరకు ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానం పొడిగించింది.
రాగిణి, సంజనా.. పర్యటనలు, పార్టీలు, ఆస్తులపై సీసీబీ ఆరా
RELATED ARTICLES