కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అందరికీ తెలిసినదే.
ఇప్పటికే వివిధ రకాల వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మన భారతదేశంలో చూసుకుంటే కొవ్యాక్సిన్, కొవిషీల్డ్, స్పుట్నిక్ మనకి అందుబాటులో ఉన్నాయి.
కరోనా మహమ్మారి ఎక్కువవడంతో ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండాలి.
వీలైనంత వరకు వ్యాక్సిన్ వేయించుకుని ఇంటి పట్టునే ఉండటం మంచిది.
బయటకు వెళ్లకుండా కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి.
అదే విధంగా మాస్క్ ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
రష్యన్ వ్యాక్సిన్ ని మన భారతదేశానికి తీసుకు వస్తున్నట్టు కూడా తెలిసినదే.
అయితే ఈ వ్యాక్సిన్ కి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.
వీటిని కనుక చూశారంటే ఈ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..?, ఎంత వరకు ఉపయోగం అనేవి తెలుస్తాయి..? మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూద్దాం.
The Drugs Comptroller General of India(DGCI) వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రష్యాలో జరిగాయి.
ఇది 91.6% ఇస్తోంది అని తెలుస్తోంది.
యూకె నుండి తయారు చేసిన ఈ వైరస్ 81% ఎఫెక్టివ్ గా పని చేస్తుందని కొవిఫీల్డ్‌లో 70.4 శాతం అఫీషియల్‌గా పనిచేస్తుందని తెలుస్తోంది.
ఏ వ్యాక్సిన్ వలన ఏ సైడ్ ఎఫెక్ట్స్
ఇక ఈ వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చూస్తే… ఏ వ్యక్తి కి అయినా సరే ఇమ్యూన్ జెనిటిక్ ఎఫెక్ట్స్‌పై పని చేస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూస్తే ఒక మనిషి నుండి మరొక మనిషికి కాస్త వేరేగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
అదే విధంగా ఒక వ్యక్తి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వరకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది తెలియదు.
వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క వ్యాక్సిన్ ఆధారంగా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
ఇక ఈ రష్యన్ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చూస్తే..
Gameleya National Centre of Epidemiology and Microbiology, Russia, Sputnik V రష్యా లో క్లినికల్ ట్రైల్స్ వేసి ఈ వ్యాక్సిన్‌ని చేయడం జరిగింది.
లాన్సెట్ ఫిబ్రవరి 2021 ప్రకారం లక్షణాలు చూస్తే…
తల నొప్పి, నీరసం, టీకా చేసిన ప్రదేశంలో నొప్పి కలగడం, ఫ్లూ ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా క్లినికల్ స్టడీస్ ప్రకారం hypertension, hemorrhagic stroke, thrombosis ఇలాంటి వస్తాయని తేలింది కానీ వ్యాక్సిన్ ఇంజక్షన్ ద్వారా ఏమీ రాలేదు.
కొవ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్
ఇక కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్, దీన్ని ఒక తయారీ ఎలా మొత్తం వివరాలు క్లుప్తంగా చూద్దాం..
దీనిని హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ తయారు చేసింది.
ఇది కూడా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
ఇప్పటికీ చాలా మంది ఈ వ్యాక్సిన్ ని తీసుకున్నారు అయితే ఏది ఏమైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజం.
కొవ్యాక్సిన్ ని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయనే విషయం చూస్తే…
ఇంజక్షన్ చేసిన ప్రాంతంలో ఎర్రగా అవడం వల్ల నొప్పి కలగడం లాంటివి జరుగుతాయి.
జ్వరం, చెమట పట్టడం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, దురద కలగడం లాంటివి రావడం తల నొప్పి కలగడం లాంటివి కొవ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చే ఇబ్బందులు. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, బ్లీడింగ్ డిసార్డర్స్, అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయ్ అనుకునే వాళ్ళు దీనికి దూరంగా ఉండటం మంచిది.
కోవిషీల్డ్ లక్షణాలు, ఎలా పని చేస్తుంది…?
దీని గురించి చూస్తే Oxford-Astrazeneca vaccine ఐడి. విశ్వ వ్యాప్తంగా 62 దేశాల లో దీనిని ఉపయోగిస్తున్నారు.
అయితే దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చూస్తే కొవి షీల్డ్ కు కోవాక్సిన్ కి మధ్య సైడ్ ఎఫెక్ట్స్ కాస్త ఒకేలా ఉంటాయి.
టీకా చేసిన ప్రదేశం లో నొప్పి కలగడం, ఎర్రగా మారడం, జ్వరం ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండడం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తాయి.
ఏ వ్యాక్సిన్ చేయించుకుంటే మంచిది…?
ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ వ్యాక్సిన్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే మనిషిని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఉండే దానిని మీరు ఎంచుకోవచ్చు దీని వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.
ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.
ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.