Homeహైదరాబాద్latest Newsప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ, లలిత ఆస్పత్రి వర్గాలకు సూచించారు. అనంతరం శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి మహాదేవపురంలో 100 పడకల లలిత మల్టీ ఫెసిలిటీ హాస్పిటల్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలను హన్మంత్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జంట సర్కిళ్ల కార్పొరేటర్లు రావుల శేషగిరి, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి సొంటిరెడ్డి పున్నారెడ్డి, జంట నగరాల వై.ఎఫ్.సి.ఏ. అధ్యక్షులు దంపబోయిన శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇంచార్జి భీమ్ భరత్,ఆస్పత్రి చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి గుర్రాల, డైరెక్టర్ల బృందం తో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి దామోదర రాజానర్సింహా మాట్లాడుతూ.అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందించాలానే లక్ష్యంతో లలిత హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అత్యాధునిక పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో ఇంత పెద్ద ఆసుపత్రి ప్రారంభించడం ఎంతో సంతోషకరం అన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫిజులతో నాణ్యమైన వైద్యాన్ని ఆందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. అనంతరం లలిత ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి గుర్రాల మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్షను లేకుండా పేద ప్రజలకు, రోగులకు సకాలంలో మెరుగైన వైద్యాన్ని అందించాలానే లక్ష్యంతోనే ఈ ప్రాంతంలో లలిత 100 పడకల మల్టీ ఫెసిలిటీ హాస్పిటల్ ను ప్రారంభించామని తెలిపారు. తమకు స్థానిక నాయకులు ప్రజలంతా సహకరించాలని కోరారు. హాస్పిటల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కస్తూరి బాలరాజ్, విజయ్ రామిరెడ్డి, అడ్వకెట్ యస్.కమలాకర్, తెలంగాణ సాయి, దరువు అంజన్న, సిద్దనోళ్ల సంజీవరెడ్డి, లలిత హాస్పిటల్ సీఈఓ. హరీష్ రెడ్డి,ఎండీ వై.యాదగిరి రెడ్డి,కో ఆర్డినేటర్ పట్నాల జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img