Homeఫ్లాష్ ఫ్లాష్#Beware #LoanApps : రుణాల యాప్‌లతో జ‌ర జాగ్రత్తా..!

#Beware #LoanApps : రుణాల యాప్‌లతో జ‌ర జాగ్రత్తా..!

హైద‌రాబాద్ః సైబ‌ర్ క్రైం కొత్త దారులు వెతుక్కుంటునే ఉంది. తాజాగా రుణాలు ఇచ్చే నెపంతో ఫోన్‌లో ఉన్న డేటాను త‌స్క‌రిస్తోంది.

త‌క్కువ మొత్తంలో వెంట‌నే రుణాలు ల‌భిస్తాయ‌నే ఉద్దేశంతో యూత్ రుణాలిచ్చే యాప్‌ల‌ను విరివిగా వాడుతున్నారు. ఇందులో స్టూడెంట్స్ అధికంగా ఉంటున్నార‌ని పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు.

షార్ట్ పీరియ‌డ్‌కు రుణాలు ఇస్తామంటారు. ఆలోపే వ‌డ్డీ పేరుతో వేధించ‌డం మొద‌లుపెడ‌తారు. వ‌డ్డీ క‌ట్ట‌డం లేట‌యితే ఇగ అంతే సంగ‌తులు.. వేధింపుల‌కు దిగుతారు.

మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లోని నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి ఫ‌లానా వ్య‌క్తి మీ నంబ‌ర్‌ని పూచీగా పెట్టి రుణం తీసుకున్నాడని బొంకుతారు. దారికి రాకుంటే లీగ‌ల్ నోటీసంటూ పంపుతారు.

మొండికేస్తే బూతుల ప‌ర్వం మొద‌లు పెడ‌తారు. న‌మ్మకం లేని ప్రైవేటు యాప్‌ల‌తో జ‌ర జాగ్ర‌త్తాగా ఉండాల‌ని సైబ‌ర్‌క్రైం పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

డౌన్‌లోడ్ చేసుకునే ముందు వాటి పుర్వాప‌రాలు తెలసుకోవాల‌ని, నిపుణుల‌ను సంప్ర‌దించడం, రేటింగ్ చెక్ చేసుకోవ‌డం, కామెంట్ సెక్ష‌న్‌ను త‌నిఖీ చేయ‌డం లాంటివి చేయాల‌ని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img