Homeసినిమా‘డబుల్ ఇస్మార్ట్’ఎంట్రీ సీక్వెన్స్​ షూటింగ్​లో బిజిబిజీ..

‘డబుల్ ఇస్మార్ట్’ఎంట్రీ సీక్వెన్స్​ షూటింగ్​లో బిజిబిజీ..

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్​కు సీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్​పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్​ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్​లోని రామ్ యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్​గా ఉంటాయట. ముఖ్యంగా రామ్, నటుడు విషు రెడ్డి మధ్య వచ్చే ఫైట్స్ చాలా థ్రిల్లింగ్​గా ఉంటాయట. ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్​పై పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్​గా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాథ్, చార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ మూవీని నిర్మించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి, డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్​లో సక్సెస్ అవుతుందో చూడాలి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img