Homeసినిమా'Bhagwant Kesari' mania in Vizag వైజాగ్​లో ‘Bhagavanth Kesari' మేనియా

‘Bhagwant Kesari’ mania in Vizag వైజాగ్​లో ‘Bhagavanth Kesari’ మేనియా

నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘భగవంత్ కేసరి’. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై మంచి హైప్​ నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఓ రేంజ్​లో హిట్ అవ్వడంతో భగవంత్ కేసరి మేనియా మొదలైంది.

ఇది వైజాగ్​లో వేరే లెవెల్​లో ఉంది. వైజాగ్​లో మొత్తం సింగిల్ స్క్రీన్లలో 40కి పైగా షోస్ ఉంటే అన్ని షోస్ కూడా భగవంత్​ కేసరికి హౌస్ ఫుల్స్ పడిపోయాయి. దీంతో విశాఖలో బాలయ్య ఫ్యాన్స్ మేనియా ఏ రేంజ్​లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఇప్పటికే వరుసగా రెండు హిట్లు కొట్టిన బాలయ్య భగవంత్​ కేసరితో హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img